: బాహుబలితో నా స్థాయి పెరిగింది!: తమన్నా


'బాహుబలి' చిత్రంలో లీడ్ రోల్ ద్వారా దర్శకుడు రాజమౌళి తనకు మంచి అవకాశమివ్వడమే కాకుండా తన క్రేజ్ ను, స్థాయిని బాగా పెంచారని మిల్క్ బ్యూటీ తమన్నా చెప్పింది. ఖమ్మంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడింది. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ రోల్ ఉంటుందని, అటువంటిది తనకు కూడా ఉందని తెలిపింది. అయితే.. బాహుబలిలో తనకు వచ్చిన క్రేజ్ ముందు ఆ డ్రీమ్ రోల్ చిన్నబోయిందంది. త్వరలోనే తన డ్రీమ్ రోల్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి, దానిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని ఈ బ్యూటీ పేర్కొంది. ప్రస్తుతం తమిళ, తెలుగు చిత్రాల సినిమా షూటింగ్ లతో చాలా బిజీగా ఉన్నట్లు చెప్పింది. అనంతరం బతుకమ్మను ఎత్తుకుని తమన్నా సందడి చేసింది. ఫొటోలకు పోజులిచ్చింది.

  • Loading...

More Telugu News