: బంగారానికి తగ్గిన డిమాండ్
ఆభరణాల తయారీదారులు, స్టాకిస్టుల నుంచి కొత్తగా బంగారం కొనుగోళ్లకు డిమాండ్ రాకపోవడంతో శుక్రవారం నాటి సెషన్లో ధరలు పడిపోయాయి. ముంబై బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 150 తగ్గి రూ. 27,150కి చేరింది. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 160 తగ్గి రూ. 37,240కి పడిపోయింది. ఇదిలావుండగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.6 శాతం దిగజారి 1,176.16 డాలర్లకు చేరుకుంది. వెండి ధర ఔన్సుకు 16.03 డాలర్లకు తగ్గింది. పండగ సీజనులో ధరలు తగ్గడానికి కారణం ప్రజల నుంచి ఆశించినంతగా కొనుగోళ్లు జరగకపోవడమేనని తెలుస్తోంది.