: బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ సింగ్ తప్పు వీసమెత్తయినా లేదు: సీబీఐ కోర్టు


సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణం వెనుక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తప్పు ఏ మాత్రమూ లేదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో మన్మోహన్ ను నిందితుడిగా చేర్చాలని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధూ కోడా, అప్పటి బొగ్గు శాఖ సహాయమంత్రి, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టులో మాజీ ప్రధానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను తిరస్కరించిన సీబీఐ కోర్టు, ఆయనకు సమన్లు జారీ చేయబోమని వెల్లడించింది. గనుల కేటాయింపుల్లో ఆయన ప్రమేయం లేదంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో దాసరి, మధూ కోడా, నవీన్ జిందాల్ సహా సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసిన 14 మందిపై విచారణ కొనసాగుతుందని తెలిపింది.

  • Loading...

More Telugu News