: బ్లాక్ లో 'బ్రూస్ లీ’ టికెట్లు... ఏలూరులో నలుగురి అరెస్ట్


టాలీవుడ్ యంగ్ హీరో రాంచరణ్ తేజ నటించిన ‘బ్రూస్ లీ’ చిత్రం నేటి ఉదయం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిరంజీవి నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రాంచరణ్ సినిమాలకు అభిమానుల్లో భారీ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రేజ్ ను సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు రంగంలోకి దిగారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్ వద్ద కొందరు వ్యక్తులు టికెట్లను చేజిక్కించుకుని ‘బ్లాక్’ విక్రయాలకు తెర తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 71 టికెట్లను సీజ్ చేసిన పోలీసులు రూ.1,350 నగదును స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News