: 28న ఇండియాకు రానున్న ఫేస్ బుక్ చీఫ్ మార్క్


కాలిఫోర్నియాలోని ఫేస్ బుక్ అధికార కార్యాలయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఆ సంస్థ చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్, సరిగ్గా నెల రోజుల తరువాత ఇండియాకు రానున్నారు. ఈ నెల 28న తాను ఇండియాకు వస్తున్నట్టు మార్క్ స్వయంగా వెల్లడించారు. ఢిల్లీలోని ఐఐటీలో జరిగే ఓ కార్యక్రమంలో తాను పాల్గొంటానని, అక్కడి విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తానని తెలిపారు. కాగా, మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మార్క్ ఇండియాకు రానుండటం ఇది రెండవ సారి. ఫేస్ బుక్ ఖాతాదారుల సంఖ్య అధికంగా ఉండటం, ఆ సంస్థకు భారత్ నుంచి మంచి ఆదాయం వస్తుండటంతో, ఇక్కడి మార్కెట్ మార్క్ కు కీలకమైంది. ఇండియాలో 13 కోట్ల మందికి పైగా నెటిజన్లు ఫేస్ బుక్ వాడుతున్నారు. ఫేస్ బుక్ అందిస్తున్న యాప్ డెవలపింగ్ ప్లాట్ ఫాం 'ఎఫ్ బీ స్టార్ట్' వాడుతున్న వారిలో 40 శాతం మంది ఇండియన్స్ కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News