: ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు


తమను ప్రేమించడం లేదనే అక్కసుతో అమ్మాయిలపై పోకిరీలు యాసిడ్ దాడులకు పాల్పడ్డ ఘటనలను ఎన్నో చూశాం. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్ దాడికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే, గుంటూరు జిల్లా తెనాలిలో వెంకటేశ్వర్లు అనే యువకుడిపై అతని ప్రియురాలు ఈ దాడి చేసింది. తనకు తెలియకుండా మరో యువతితో కూడా ప్రేమాయణం సాగిస్తున్నాడనే కోపంతో ఈ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు ముఖంతో పాటు శరీరంలోని పలు చోట్ల కాలిన గాయాలయ్యాయి. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వెంకటేశ్వర్లుకు చికిత్స చేయిస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ ఘటనపై ఇంతవరకు కేసు నమోదు కాలేదు.

  • Loading...

More Telugu News