: బీహార్ మహాకూటమి బద్దలు... ఎన్సీపీ గుడ్ బై
బీహార్ లో రెండో విడత ఎన్నికలు జరుగుతున్న వేళ ఆరు పార్టీల మహాకూటమి బద్దలైంది. ఇప్పటికే మహాకూటమిలోని పార్టీల అధినేతల మధ్య ఉన్న అగాధాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే, తాజాగా కూటమి నుంచి తప్పుకుంటున్నట్టు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ప్రకటించింది. కూటమిలోనే బీజేపీకి అనుకూల శక్తులు ఉన్నాయని ఆ పార్టీ కార్యదర్శి, పార్లమెంట్ సభ్యుడు తారిక్ అన్వర్ వ్యాఖ్యానించారు. బాధ్యతగల నేతగా కూటమి గెలుపునకు కృషి చేయాల్సిన ములాయం సింగ్ యాదవ్ బీజేపీకి అనుకూల వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా తాము గుడ్ బై చెబుతున్నట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. కాగా, బీహారులో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని, ప్రస్తుత ఎన్నికల్లో గెలిచేది ఎన్డీయేనేనని రెండు రోజుల క్రితం ములాయం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.