: వాయిదాపడ్డ 'అఖిల్'
ప్రముఖ సినీ నటుడు నాగార్జున కుమారుడు అఖిల్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'అఖిల్' విడుదల వాయిదా పడింది. వాస్తవానికి దసరా సందర్భంగా అక్టోబర్ 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా జరుగుతుండటంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. ఈ సినిమాకు నిర్మాత అయిన యంగ్ హీరో నితిన్ ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్లో తెలిపాడు. "గ్రాఫిక్స్ పనుల్లో కొంచెం జాప్యం జరగడం వల్ల అఖిల్ ను 22న విడుదల చేయలేకపోతున్నాం. సారీ ఫర్ ది డిలే. సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తామన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తాం" అంటూ నితిన్ ట్వీట్ చేశాడు.