: జగన్ వద్దన్నా... ఆహ్వానం పంపుతాం: యనమల స్పష్టీకరణ


నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఓ స్పష్టమైన విధానంతో ముందుకెళుతోంది. ఎవరు వద్దన్నా, ఎవరు కాదన్నా... తాను రూపొందించుకున్న మార్గంలోనే ముందుకు సాగేందుకు నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ముందే నిర్ణయించుకున్న వారికి ఆహ్వాన పత్రాలు పంపేందుకు సన్నాహకాలు చేస్తోంది. ఈ క్రమంలో కార్యక్రమానికి హాజరు కానని బహిరంగంగా ప్రకటించిన వైసీపీ అధినేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా ఆహ్వాన పత్రం పంపుతానని ప్రకటించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విస్పష్ట ప్రకటన చేశారు. కార్యక్రమానికి హాజరుకావడమా, విరమించుకోవడమా అన్న విషయం జగన్ వ్యక్తిగతమైనదని ఆయన పేర్కొన్నారు. తాము మాత్రం జగన్ కు ఆహ్వాన పత్రం పంపి తీరుతామని ప్రకటించారు. ప్రత్యేక హోదాకు, ప్యాకేజీకి లంకె పెడుతూ విపక్షాలు చేస్తున్న విమర్శల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టారు.

  • Loading...

More Telugu News