: లంచ్ బ్రేక్ లో 'ఏ' వెబ్ సైట్ లనైనా చూసుకోండి!


ఇటలీలో ఉద్యోగులకు ఊరటనిస్తూ, ఆ దేశ సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. వారికి కేటాయించిన లంచ్ బ్రేక్ సమయంలో పోర్న్ వెబ్ సైట్లను చూసినందున వారిని విధుల నుంచి తొలగించడం తప్పని, ఆ సమయంలో వారు ఏ వెబ్ సైటునైనా చూసుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రముఖ కార్ల సంస్థ ఫియట్ లో తనను అకారణంగా విధుల నుంచి తొలగించారని కోర్టును ఆశ్రయించగా, ఈ తీర్పు వచ్చింది. "పని వేళల్లో ఆ ఉద్యోగి అశ్లీల చిత్రాలను చూశాడు, ఇది యాజమాన్యం అతనిపై పెట్టుకున్న నమ్మకానికి విఘాతం కలిగించింది" అని ఫియట్ తరఫు న్యాయవాది వాదించగా, తాను కేవలం సెకన్ల పాటు, అది కూడా భోజన విరామ సమయంలో చూశానని తెలిపాడు. అంతమాత్రానికే తనను తొలగించడం అన్యాయమన్న అతని వాదనతో కోర్టు ఏకీభవించింది.

  • Loading...

More Telugu News