: కూతురు సెల్ఫీతో రిలాక్స్ అయిన సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ


ఏపీకి ప్రత్యేక హోదా కోసం భారీ పాదయాత్ర చేపట్టిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బిజీబిజీగా మారిపోయారు. అనంతపురం జిల్లాలో ప్రారంభమైన యాత్ర త్వరలో శ్రీకాకుళం చేరుకోనుంది. ఈ క్రమంలో త్వరితగతిన యాత్రను పూర్తి చేసేందుకు శ్రమిస్తున్న రామకృష్ణ సాయంత్రమయ్యేసరికి అలసిపోతున్నారు. అయితే నిన్న విజయవాడలో ఆయనకు మాంచి రిలాక్స్ లభించింది. హైదరాబాదులో జర్నలిజంలో డిగ్రీ చేస్తున్న ఆయన కూతురు సాయిలీల విజయవాడలో రామకృష్ణకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. యాత్రలో భాగంగా విజయవాడలో ఓ వేదిక వద్ద ఉన్న ఆయన వద్దకు వచ్చిన సాయిలీల ‘డాడీ... ఓ సెల్ఫీ ప్లీజ్’ అంటూ పలకరించింది. కూతురును చూసిన సంతోషంలో రామకృష్ణ సంతోషంగా సెల్ఫీకి పోజిచ్చారు. కాస్తంత రిలాక్స్ అయ్యారు.

  • Loading...

More Telugu News