: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని తిరిగిచ్చేసిన తొలి తెలుగు రచయిత
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ, ప్రముఖ రచయిత, తాను రాసిన 'ఉగ్గుపాలు' పుస్తకానికి 2010లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన ఎం.భూపాల్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకిచ్చిన పురస్కారాన్ని తిరిగి ఇచ్చివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ప్రకటించిన తొలి తెలుగు రచయిత భూపాల్ కావడం గమనార్హం. ఎన్నో విషయాల్లో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. కాగా, భూపాల్ రచయితగానే కాకుండా, తెలంగాణ ఇతివృత్తంగా తీసిన పలు చిత్రాల్లో నటుడిగా కూడా మెప్పించారు.