: ఏఈని దుర్భాషలాడా... చేయి మాత్రం చేసుకోలేదంటున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే
బిల్లుల మంజూరులో జాప్యం చేస్తున్నారంటూ సాగునీటి శాఖ ఇంజినీర్ ను ఇంటికి పిలిచి మరీ చెంపలు వాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదిలాబాదు జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సదరు ఘనటపై వివరణ ఇచ్చారు. ఈ మేరకు నిన్న ఆయన భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావును కలిశారు. ఇంజినీర్ ను తీవ్ర పదజాలంతో దుర్భాషలాడిన మాట నిజమేనని, అయితే ఆయనపై చేయి చేసుకోలేదని ఎమ్మెల్యే చెప్పారు. సాంతం విన్న హరీశ్ రావు... చేయి చేసుకోకపోయినా, ఇంజినీర్ పట్ల వ్యవహరించిన తీరు మాత్రం సరికాదని ఎమ్మెల్యేకు ముఖం మీదే చెప్పేశారట.