: మోదీకి ఇచ్చిన అమరావతి ఆహ్వాన పత్రిక ఖరీదెంతో తెలుసా?


నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కలకాలం గుర్తుండేలా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. కేవలం రాజధాని శంకుస్థాపనకు వందల కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తూ ప్రభుత్వం దుబారా మంత్రాన్ని పఠిస్తోందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అయితే, రాజధాని శంకుస్థాపనకు కేవలం రూ.10 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు నిన్న ఏపీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు ఓ ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు. మొన్నటి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీకి అమరావతి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ ఆహ్వాన పత్రిక కోసం కేవలం రూ.70 మాత్రమే ఖర్చు చేసినట్లు నిన్నటి మీడియా సమావేశంలో మంత్రులు వెల్లడించారు. శంకుస్థాపన కోసం కేటాయించిన నిధుల్లో గుంటూరు కలెక్టర్ కు రూ.7 కోట్లు, విజయవాడ కలెక్టర్ కు రూ.2 కోట్లు మాత్రమే విడుదల చేశామని కూడా వారు తెలిపారు. కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపార దిగ్గజాలు కూడా వస్తున్నందున వారి కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్ లు ఏర్పాటు మినహా ఎక్కడా దుబారా లేదని వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News