: ఇద్దరు ఎస్సైలను అరెస్ట్ చేసిన ఆల్వాల్ పోలీసులు...‘రియల్’ బెదిరింపులే కారణమట!


హైదరాబాదు కమిషనరేట్ పరిధిలోని ఆల్వాల్ పోలీసులు నిన్న రాత్రి ఇద్దరు పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్(ఎస్సై)లను అరెస్ట్ చేశారు. నిజామాబాదు పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న ప్రతాప్ లింగంతో పాటు మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న వినాయక్ రెడ్డిలు తమ పరిధిని అతిక్రమించి హైదరాబాదులో అడుగు పెట్టారు. ఓ భూ వివాదానికి సంబంధించి వీరిద్దరూ శ్రీనివాస్ అనే రియల్టర్ ను బెదిరించారు. తుపాకీ తీసి కాల్చేస్తామంటూ సదరు ఎస్సైలిద్దరూ తనపై బెదిరింపులకు పాల్పడ్డారని శ్రీనివాస్ ఆల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఆల్వాల్ పోలీసులు ఘటనపై విచారణ జరిపి, ఎస్సైల బెదిరింపులు వాస్తవమేనని తేల్చారు. వెనువెంటనే ఇద్దరు ఎస్సైలతో పాటు ఆ ఎస్సైల వెనుకున్న రఘు, లక్ష్మినారాయణ అనే ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News