: ‘ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ద ఇయర్’గా తెలంగాణ... కొత్త రాష్ట్రానికి సరికొత్త అవార్డు!
కొత్త రాష్ట్రం తెలంగాణ సరికొత్త అవార్డుకు ఎంపికైంది. సీఎన్ బీసీ-టీవీ18 అందజేసే ‘ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు తెలంగాణ ఎంపికైంది. ఈ మేరకు సదరు చానెల్ ‘ఇండియన్ బిజినెస్ లీడర్స్ అవార్డు’ జ్యూరీ కమిటీ తెలంగాణకు పురస్కారాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సీఎం కేసీఆర్ కు సీఎన్ బీసీ-టీవీ 18మేనేజింగ్ ఎడిటట్ షెరీన్ భాన్ లేఖ రాసినట్లు సీఎం కార్యాలయం నిన్న ఓ ప్రకటనలో తెలిపింది. జ్యూరీ కమిటీ నియమ నిబంధనలన్నింటికీ తెలంగాణ సరి తూగిందని, అత్యంత నిపుణతను చాటుకుందని భాన్ తన లేఖలో పేర్కొన్నారు. త్వరలో జరగనున్న అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కావాలని సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. ఇక తెలంగాణకు అవార్డు పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.