: ఢిల్లీలోని దుర్గామాత మండపాల్లో వైఫై సదుపాయం
దక్షిణ ఢిల్లీలోని సీఆర్ పార్క్, ఉత్తర ఢిల్లీలోని వసుంధరా ఎన్క్లేవ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాల్లో వైఫై సేవలను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని మండపాల నిర్వాహకులు తెలిపారు. తొమ్మిదిరోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. భక్తుల సౌకర్యార్థం వైఫై సేవలను అందిస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. ఇదిలా ఉండగా, ఢిల్లీలో దుర్గామాత నవరాత్రుళ్లు ఘనంగా జరుగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ రహిత మండపాలను ఢిల్లీలో ఏర్పాటు చేశారు. అంతేగాక, ప్లాస్టిక్, కాలుష్యకారకమైన వస్తువులను మండపాల అలంకరణకు ఉపయోగించకుండా నిషేధించారు. మట్టికుండలు, జనపనార వంటి వస్తువులతో మండపాలను అలంకరించి పర్యావరణ పరిరక్షణకు నిర్వాహకులు పాటుపడుతున్నారు.