: ఉద్యమంలో సక్సెస్ అయ్యుండొచ్చు... పాలనలో మాత్రం ఫెయిల్: కేసీఆర్ పై తమ్మినేని సెటైర్
పరిపాలనలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శలు గుప్పించారు. ఉద్యమంలో కేసీఆర్ సక్సెస్ అయితే అయ్యుండొచ్చు... పాలనలో మాత్రం ఫెయిల్ అయ్యారని ఎద్దేవా చేశారు. కార్మికులు, దళితులు, రైతులు, గిరిజనులు ఇలా అన్ని వర్గాలను అణగదొక్కేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రభుత్వంపై పోరాడాలని వామపక్షాలు, సామాజిక శక్తులు నిర్ణయించాయని తెలిపారు. రైతు రుణాలపై వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.