: మా వార్డులకు నిధుల్లేవ్!... గుడివాడలో తెలుగు తమ్ముళ్ల గగ్గోలు


వైసీపీ నేత, నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని) ఇలాకా గుడివాడలో టీడీపీ కౌన్సిలర్ల వార్డులకు నిధులు మంజూరు కావడం లేదట. దీనిపై టీడీపీ కౌన్సిలర్లు గగ్గోలు పెడుతున్నారు. నేటి ఉదయం గుడివాడ మునిసిపల్ సర్వసభ్య సమావేశంలో ఈ విషయంపై టీడీపీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది.

  • Loading...

More Telugu News