: కోహ్లీ కూడా మెరిశాడట... ఎలాగంటే?
ఫ్రీడమ్ సిరీస్ లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా అంతగా ఏమీ రాణించలేదు. టీ20, వన్డేల్లో అతడి బ్యాటు నుంచి పెద్డగా పరుగులేమీ రాలేదు. నిన్న ఇండోర్ లో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ వీర విహారం చేశాడు. కొత్త కుర్రాడు అక్షర్ పటేల్ బంతితో మాయాజాలం చేశాడు. వెరసి ఓడిపోతుందనుకున్న మ్యాచ్ లో టీమిండియా అనూహ్య విజయాన్ని అందుకుంది. టీమిండియా విజయానికి కారణం ఈ ఇద్దరు, మరో ఇద్దరు బౌలర్లు మాత్రమే కాదు, కోహ్లీ కూడా రాణించాడు. కేవలం 12 పరుగులు మాత్రమే చేసి రనౌట్ అయిన కోహ్లీ ఎలా రాణించాడనేగా, మీ అనుమానం? బ్యాటింగ్ లో విఫలమైన కోహ్లీ ఫీల్డింగ్ లో మాత్రం సఫారీలకు చుక్కలు చూపాడు. ఒంటి చేత్తో మూడు క్యాచ్ లు పట్టి ముగ్గురు కీలక బ్యాట్స్ మెన్ ను అతడు పెవిలియన్ చేర్చాడు. అయినా కోహ్లీ ఎవరెవరిని ఔట్ చేశాడో తెలుసా?... భీకర ఫామ్ లో ఉన్న సఫారీ కెప్టెన్ డివిలియర్స్, డూప్లెసిస్, స్టెయిన్స్ ల క్యాచ్ లను పట్టి జట్టుకు కోహ్లీ తన వంతు సహకారం అందించాడు. కోహ్లీ మెరుపు వేగంతో కదిలి పట్టిన తొలి రెండు క్యాచ్ లు మ్యాచ్ ను భారత్ వైపు తిప్పేశాయి.