: ప్లేస్ మెంట్లలో చెన్నై వర్సిటీ రికార్డు... ఒక్క రోజులో 6,064 మంది విద్యార్థులకు కొలువులు
క్యాంపస్ ఇంటర్వ్యూల్లో చెన్నైకి చెందిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రికార్డు సృష్టించింది. ఒక్కటంటే ఒక్క రోజులో 6,064 మంది విద్యార్థులకు ఆ వర్సిటీ ఉద్యోగాలనిప్పించింది. ఇక వీరికి ఉద్యోగాలిచ్చిన కంపెనీలు అల్లాటప్పా కంపెనీలేమీ కాదు. టెక్ దిగ్గజాలు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీల్లో ఎస్ఆర్ఎం విద్యార్థులకు కొలువులు దక్కాయి. ఇండస్ట్రీకి అనుగుణమైన విద్యాబోధన ద్వారానే ఈ ఘనతను సాధించినట్లు వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రబీర్ బాగ్చి ప్రకటించారు. ఇక ఉద్యోగాల విషయానికొస్తే... విప్రోలో 1,641 మంది, టీసీఎస్ లో 1,611 మంది, కాగ్నిజెంట్ లో 1,506 మంది, ఇన్ఫోసిస్ లో 1,306 మంది ఎస్ఆర్ఎం వర్సిటీ విద్యార్థులు కొలువులు దక్కించుకున్నారు.