: 9 రోజుల ఉత్కంఠకు తెర...టీడీపీ గిరిజన నేతలను వదిలేసిన మావోలు


విశాఖ జిల్లాలో తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత తెర పడింది. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో టీడీపీకి చెందిన ముగ్గురు గిరిజన నేతలను నిషేధిత మావోయిస్టులు అపహరించిన సంగతి తెలిసిందే. మావోల దుశ్చర్యతో విశాఖ మన్యంలో కలకలం రేగింది. ఇటు ప్రభుత్వంతో పాటు అటు గిరిజన సంఘాలు బందీల విడుదల కోసం ఎంతమేర యత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. అయితే గిరిజన ఉద్యోగ సంఘాలు నెరపిన దౌత్యం చివరకు ఫలించింది. నిన్న రాత్రి ముగ్గురు టీడీపీ నేతలను మావోలు విడిచిపెట్టారు. అంతకుముందు అటవీ సమీప గ్రామాల్లో మావోలు ప్రజాకోర్టు నిర్వహించారు. ఇకపై టీడీపీకి దూరంగా ఉంటూ బాక్సైట్ ఉద్యమానికి ముందుండి నడవాలని ముగ్గురు టీడీపీ నేతలకు మావోలు ఆదేశాలు జారీ చేశారు. గిరిజన ఉద్యోగ సంఘాల పిలుపు మేరకే తాము బందీలను విడుదల చేస్తున్నట్లు మావోలు ప్రకటించారు.

  • Loading...

More Telugu News