: ‘బ్రూస్ లీ’లో చిరు నటనకు ఇంకెన్ని ప్రశంసలొస్తాయో!: దర్శకుడు గుణశేఖర్


‘బ్రూస్ లీ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రకు ఇంకెన్ని ప్రశంసలొస్తాయో!’ అంటూ రుద్రమదేవి చిత్ర దర్శకుడు గుణశేఖర్ అన్నారు. రుద్రమదేవి చిత్రానికి చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పిన విషయం తెలిసిందే. ఆయన వాయిస్ ఓవర్ కు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గుణశేఖర్ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. చాలాకాలం తర్వాత చిరంజీవి తెరపై కనిపించనుండటంతో బ్రూస్ లీ చిత్ర యూనిట్ కు ఆయన అభినందనలు తెలుపుతూ.. చిరంజీవి పోస్టర్ ను గుణ శేఖర్ పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News