: రాజధాని శంకుస్థాపనలో పాలుపంచుకోండి: సీఎం చంద్రబాబు పిలుపు


మన మట్టి - మన నీరు కార్యక్రమం చురుగ్గా సాగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. సంప్రదాయం ప్రకారం అన్ని గ్రామాల నుంచి మట్టి, నీరు సేకరిస్తున్నామన్నారు. 16 వేల గ్రామాల నుంచి నీరు, మట్టి రాజధానికి తీసుకువస్తున్నట్లు చెప్పారు. దేశంలోని పుణ్యక్షేత్రాల నుంచి నదీ జలాలు తీసుకువచ్చి పూజలు చేస్తున్నామని, అందరి భాగస్వామ్యం ఉండేలా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకే ఈ కార్యక్రమమని అన్నారు. ప్రతిఒక్కరూ రాజధాని శంకుస్థాపనలో భాగస్వామ్యం కావాలని చంద్రబాబు కోరారు. స్వచ్ఛభారత్ గురించి ఆయన మాట్లాడుతూ, దీనికి సంబంధించి ఇప్పటికే 4 కమిటీలు వేశామన్నారు. స్వచ్ఛభారత్ పై ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరముందని, దీనిని జయప్రదం చేయాలంటే ఆర్థికవనరులు సమకూర్చుకోవాలని అన్నారు. స్వచ్ఛ భారత్ పై పిల్లలకు తరగతులు నిర్వహించాలని, పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని, ప్రజల్లో అవగాహన కోసం కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. 75 శాతం నిధులు కేంద్రం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్ఛ భారత్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు కూడా స్వచ్ఛభారత్ కోసం ఖర్చు పెట్టాలని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News