: బాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టింది: వైఎస్పార్సీపీ నేత
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పబ్లిసిటీ పిచ్చి పట్టిందని.. అది మరింత ముదిరిందని వైఎస్సార్సీపీ నేత బత్తుల బ్రహ్మానందరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల జీతాలకే డబ్బులు లేవంటున్న బాబు తన ప్రచారానికి, రాజస్థాని శంకుస్థాపనకు కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గోదావరి పుష్కరాలలో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని, పథకాల పేరిట వందల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చే అతిథులకు వాళ్ల సొంత హోటళ్లలో విడిది ఏర్పాటు చేసి ప్రజల సొమ్మును ఖర్చుపెడుతున్నారని విమర్శించారు. ఓటుకు నోటు వ్యవహారం నుంచి చంద్రబాబు బయటపడేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానిస్తున్నారని బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు.