: సాహిత్య అకాడమీ అవార్డు వెనక్చిచ్చేసిన మరో కవయిత్రి


సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కి యిచ్చేసిన జాబితాలో తాజాగా మరో కవయిత్రి పేరు చేరింది. ఉత్తరప్రదేశ్ లోని దాద్రి ఘటన, రచయితలు, అభ్యుదయవాదులపై జరిగిన దాడులను నిరసిస్తూ తన సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్లు బెంగాల్ కవయిత్రి మందక్రాంత్ సేన్ ప్రకటించారు. యువ రచయితలకు అకాడమీ ఇచ్చే స్వర్ణ జయంతి సాహిత్య ప్రత్యేక అవార్డును 2004లో ఆమె అందుకున్నారు. కాగా, ఇప్పటి వరకు 22 కవితా సంకలనాలు, 7 బెంగాలీ నవలలను రాసిన మందక్రాంత్ సేన్ ఆనంద, కృత్తివాస్ పురస్కారాలు ఆమెకు లభించాయి.

  • Loading...

More Telugu News