: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జగన్ డిశ్చార్జ్
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ డిశ్చార్జ్ అయ్యారు. మరికాసేపట్లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు. జగన్ ఆరోగ్యం కుదుటపడిందని, ఎప్పుడైనా డిశ్చార్జ్ కావొచ్చని ఆసుపత్రి వైద్యులు ఇవాళ చెప్పిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన కాసేపటి కిందట డిశ్చార్జ్ అయ్యారు. ప్రత్యేక హోదా కోసం ఆరు రోజుల పాటు జగన్ దీక్ష చేయగా, నిన్న(మంగళవారం) ఆయన దీక్షను భగ్నం చేసిన పోలీసులు బలవంతంగా ఆసుపత్రిలో చేర్పించారు.