: ప్రమాదంలో భారత ప్రజల స్వాతంత్ర్యం: పాక్ పత్రిక 'డాన్' గగ్గోలు


ఇండియాలో విస్తరిస్తున్న హిందూ మతోన్మాదం, ఆ దేశంలోని ప్రజల స్వాతంత్ర్యాన్ని ప్రమాదంలో పడేసేంతగా మారిందని ప్రముఖ పాకిస్థాన్ దినపత్రిక వ్యాఖ్యానించింది. "భిన్నత్వంలో ఏకత్వం అన్న నినాదానికి ఇండియా మరోసారి పునరంకితం కావాల్సిన సమయమిది" అని 'డాన్' పత్రిక తన సంపాదకీయంలో అభిప్రాయపడింది. ఇండియాలో వామపక్ష భావజాలం నానాటికీ వృద్ధి చెందుతోందని పేర్కొంది. "భారత్ లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనడానికి కారణాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని పాకిస్థాన్ కు సంబంధించినవీ ఉన్నాయి. శివసేన కార్యకర్తలు పాక్ గాయకుడు గులాం అలీ ప్రదర్శనను అడ్డుకున్నారు. అంతకన్నా ఘోరంగా పాక్ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ కసూరీ రాకను వ్యతిరేకిస్తూ, ఆ కార్యక్రమ నిర్వాహకుడికి నల్ల ఇంకును పూశారు" అని పత్రిక గుర్తు చేసింది. ఈ తరహా చర్యలు భారత సంస్కృతి, మత సామరస్యానికి విఘాతాలు. వీటిని సహించి ప్రోత్సహిస్తే, ఇండియాలో పరిస్థితి మరింతగా దిగజారుతుందని తెలిపింది. మోదీ అండ చూసుకునే కొందరు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించింది.

  • Loading...

More Telugu News