: భారత్-పాక్ సరిహద్దుల్లో భారీగా హెరాయిన్ పట్టివేత


భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో భారీగా హెరాయిన్ పట్టుబడింది. సరిహద్దుల్లోని చిన్న బిద్ చంద్ సెక్టార్ లోని పంట పొలాల్లో పంజాబ్ పోలీసులు, బీఎస్ఎఫ్ దళాలు సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో ఈ హెరాయిన్ కనుగొన్నామని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు రాత్రిపూట గస్తీ తిరుగుతున్న సమయంలో పాకిస్థానీయులు ఈ హెరాయిన్ ను వదిలి వెళ్లారని చెప్పారు. దాదాపు 12 కేజీల హెరాయిన్ ను సీజ్ చేశామన్నారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్ లో రూ.60 కోట్ల వరకు ఉంటుందన్నారు. అయితే ఈ ఏడాదిలో ఇప్పటివరకు 230 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News