: తిరుమల బ్రహ్మోత్సవాల్లో పోలీసుల ఓవరాక్షన్...రద్దీ లేకున్నా మహిళలను తోసేసిన వైనం
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజే పోలీసులు ఓవరాక్షన్ చేశారు. నేటి ఉదయం ప్రారంభమైన తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచ్చి వాహన సేవ జరుగుతోంది. తొలి రోజు కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. అయినా భద్రత పేరిట పోలీసులు నానా రభస చేశారు. అవసరం లేకున్నా, రంగప్రవేశం చేసి భక్తులపై విరుచుకుపడ్డారు. పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా కనిపించిన వారందరినీ తోసేశారు. ఓ పోలీసు అధికారి తన పరిధి దాటి ఓ మహిళను తోసేయగా, ఆమె కిందపడిపోయారు. దీంతో అక్కడున్న భక్తులంతా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బ్రహ్మోత్సవాల్లో తొలిరోజే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.