: ఆహారం ధరలు పెరిగినా, సెప్టెంబరులో 'మైనస్'లోనే ద్రవ్యోల్బణం... ఎందుకంటే!


వరుసగా 11వ నెలలోనూ టోకు ధరలు తగ్గాయి. గడచిన సెప్టెంబరులో హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ద్రవ్యోల్బణం మైనస్ 4.54 శాతంగా నమోదైంది. అంతకుముందు ఆగస్టులో ద్రవ్యోల్బణం మైనస్ 4.95 శాతంగా నిలిచిన సంగతి తెలిసిందే. బుధవారం నాడు కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం, గత సంవత్సరంతో పోలిస్తే ఆహార ఉత్పత్తుల ధరలు 0.69 శాతం పెరిగాయి. అయినప్పటికీ గణాంకాలు వ్యతిరేక దిశలోనే ఉండటానికి ఇంధన ధరల సరళే కారణం. 2014, సెప్టెంబరుతో పోలిస్తే క్రూడాయిల్ ధరలు ప్రస్తుతం 17.71 శాతం తక్కువగా ఉన్నాయి. ఈ కారణం చేతనే ఇన్ ఫ్లేషన్ సున్నా కన్నా తక్కువగా కనిపిస్తోందని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, సెప్టెంబరులో ఉత్పత్తి రంగం గణాంకాలు 2014తో పోలిస్తే 1.73 శాతం తగ్గాయి. గత రెండు మూడు నెలల్లో అన్ని రకాల ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాల ధరలు, కూరగాయలు, పాలు తదితర ఉత్పత్తుల ధరలు పెరిగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News