: తెలంగాణ వాటర్ గ్రిడ్ పైప్ లైన్ పై రేవంత్ విమర్శలు


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పైప్ లైన్ పై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ విమర్శలు చేశారు. నల్లొండ జిల్లా చౌటుప్పల్ లో వాటర్ గ్రిడ్ పైలాన్ ను ఇవాళ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు, రేవంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.2కోట్లతో నిర్మించిన పైలాన్ నెలరోజుల్లోనే శిథిలావస్థకు చేరిందన్నారు. దాన్ని బట్టి 40వేల కోట్లతో చేపట్టబోతున్న ఈ ప్రాజెక్టు ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. అవినీతి పాలనకు వాటర్ గ్రిడ్ పైలానే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఈ గ్రిడ్ పైప్ లైన్ కేసీఆర్ కుటుంబానికి క్యాష్ లైన్ అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News