: దొంగగా మారిన పోలీసు భార్య... కారణం విని చలించిన పోలీసులు!


ఆమె ఓ పోలీసు భార్య. ఓ దొంగతనం చేసి తొలుత సీసీటీవీ ఫుటేజ్ కి, ఆపై పోలీసులకు దొరికిపోయింది. విచారణలో భాగంగా ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ విన్న అధికారులు కదిలిపోయారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ముంబైలో జీఆర్పీ కానిస్టేబుల్ కిసాన్ కట్కర్ భార్య ఉషా కట్కర్ (40) గత వారం ఓ దొంగతనం చేసింది. రూ. 16 వేల నగదు, సెల్ ఫోన్ ఉన్న అశోక్ రావ్ జీ అనే వ్యక్తి బ్యాగును ఆమె దొంగిలించింది. ఆయన ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన పోలీసులు ఉషను అదుపులోకి తీసుకుని విచారించారు. ఓ మిస్ ఫైర్ కేసులో తన భర్తను పోలీసులే అరెస్ట్ చేశారని ఇంటరాగేషన్ లో ఆమె తెలిపింది. ఆనాటి నుంచి తాము అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఇల్లు కూడా గడవడం లేదని వాపోయింది. ఇంట్లోని వారికి భోజనం పెట్టేందుకే తాను దొంగగా మారానని తెలిపింది. ఆమె పరిస్థితి తమను కదిలించినా, చేసిన పని, ఎంచుకున్న మార్గం తప్పని పోలీసులు వ్యాఖ్యానించారు. కాగా, ఓ లోకల్ రైలులో మద్యం తాగి డ్యూటీ చేస్తున్న కిసాన్ చేతిలోని తుపాకీ పేలిన కారణంతో ఆయనను 2011లో అరెస్ట్ చేసి, ఆపై సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News