: షీనా హత్యకేసు... సీబీఐ విచారణలో మరో కోణం!
భారత కార్పొరేట్ రంగంలో కలకలం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో నిందితురాలిగా ఉంటూ, ప్రస్తుతం జైల్లో కాలం గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జియా, తాజాగా సీబీఐ విచారణలో మరో కొత్త విషయాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. షీనా బోరాను హత్య చేసింది తాను కాదని, మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ లు అమెను చంపారని వెల్లడించినట్టు సీబీఐ వర్గాలు తెలిపారు. ఏప్రిల్ 24, 2012న తాను షీనాను డిన్నర్ కు పిలిపించానని, ఆపై డిన్నర్ అనంతరం ఆమె వర్లీలోని తన ఇంటికి వెళ్లిపోయిందని ఇంద్రాణి తాజా స్టేట్ మెంటు ఇచ్చినట్టు సమాచారం. షీనా తీరుతో, ఆ సమయంలో పీటర్ ముఖర్జియా దత్త పుత్రికగా ఉన్న తన కుమార్తె చెడిపోతుందన్న భయంతోనే ఆయన ఈ హత్య చేసినట్టు వెల్లడించింది. బైకుల్లా జైల్లో ఇంద్రాణిని కలిసిన ముగ్గురు సభ్యుల సీబీఐ బృందం ఈ తాజా స్టేట్ మెంటును రికార్డు చేసినట్టు తెలుస్తోంది. ఆమె విచారణకు సహకరించిందని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.