: తొమ్మిది రోజులూ పవిత్ర దినాలు... ఎవరినీ విమర్శించనంటున్న ఎంపీ కవిత
దసరా నవరాత్రులు ముగిసేవరకూ తాను ఎవరినీ విమర్శించబోనని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత వ్యాఖ్యానించారు. బతుకమ్మ పండగపై కొందరు రాజకీయ విమర్శలు చేస్తున్నారని, వారి గురించి తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. పవిత్ర పర్వదినం జరుగుతున్న రోజుల్లోనూ రాజకీయాలు మాట్లాడటం సరికాదని ఆమె అన్నారు. హుస్నాబాద్ లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఆమె, ఆశా కార్యకర్తల సమస్య కేంద్రం పరిధిలో ఉందని, వారి సమస్యలు తీర్చి న్యాయం చేకూర్చేందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఆశా కార్యకర్తలు నిరసనలు నిలిపివేసి, తమతో కలసి బతుకమ్మ సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.