: నేడు మందు బిళ్ల దొరకదు!... దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్


దేశవ్యాప్తంగా నేడు మందు బిళ్లలు దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే, దేశంలోని అన్ని ప్రాంతాల్లోని మెడికల్ షాపులు నేడు మూతపడనున్నాయి. ఆన్ లైన్ లో ఔషధ విక్రయాలకు నిరసనగా మెడికల్ షాపుల నిర్వాహకులు నేడు దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు నిబంధనల పేరిట తమ విక్రయాలు బాగా తగ్గాయని ఆరోపిస్తున్న మెడికల్ షాపుల నిర్వాహకులు, తాజాగా ఆన్ లైన్ విక్రయాలతో తమ వ్యాపారాలు పెను ప్రమాదంలో చిక్కుకోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆన్ లైన్ లో మందుల విక్రయాలను నిలిపేయాలని మెడికల్ షాపుల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. ఔషధాలను ఆన్ లైన్ లో విక్రయిస్తున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని సవరించాలని కోరుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులను మూసేస్తున్నట్లు వారు ప్రకటించారు. దీంతో మందు బిళ్లల కోసం నేడు రోగులు ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News