: సిద్ధాపురంలో పర్యటించిన మహేష్ బాబు ప్రతినిధులు
మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామానికి ప్రిన్స్ మహేష్ బాబు తన ప్రతినిధులు కొందరిని పంపారు. అక్కడికి వెళ్లిన ప్రతినిధులలో కృష్ణ, మహేష్ ప్రజాసేన రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ ఘోరీ, కందుకూరి భూపాల్ రెడ్డి, మధు తదితరులు ఉన్నారు. స్థానిక నేతలతో సమావేశమై ప్రధాన సమస్యలు, పరిష్కారాలపై వారు చర్చించారు. గ్రామ సర్పంచ్ నర్సమ్మ, ఎంపీటీసీ బాలయ్యతో పాటు యువకులు, నాయకులతో కలిసి మహేష్ ప్రతినిధులు ఆ గ్రామంలో పర్యటించారు. ఈ నెల 15న హైదరాబాద్ లో సిద్ధాపూర్ సర్పంచ్, ఎంపీటీసీలతో జరిగే సమావేశంలో ఆ గ్రామ దత్తత విషయమై మహేష్ బాబు చర్చించనున్నట్లు ఆయన ప్రతినిధులు తెలిపారు. కాగా, సిద్ధపూర్ గ్రామాన్ని తాను దత్తత తీసుకోనున్నట్లు గత నెల 28వ తేదీన మహేష్ బాబు ప్రకటించిన విషయం తెలిసిందే.