: బీహార్ ఎక్సైజ్ మంత్రిపై ఎఫ్ఐఆర్


ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త నుంచి రూ.4 లక్షలు లంచం తీసుకున్న ఆరోపణలపై బీహార్ ఎక్సైజ్ మంత్రి అవదేష్ కుష్వాహపై ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదైంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదేశాల మేరకు అవధేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతేగాక అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి కూడా ఆయన్ని పక్కనబెట్టారు. అవధేష్ లంచం తీసుకుంటున్న సమయంలో తీసిన వీడియో ఒకటి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. బీహార్ ఎన్నికలు ప్రారంభం కావడానికి ఒకరోజు ముందు ఈ వ్యవహారం బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నితీష్ చర్యలు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News