: ఎన్టీఆర్ నివాసం వద్ద మట్టి, నీరు సేకరించిన లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన తాత దివంగత ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరులో మన మట్టి-మన నీరు కార్యక్రమాన్ని చేపట్టారు. రాజధాని అమరావతి నిర్మాణంలో ఏపీ వాసులందరినీ భాగస్వాములను చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నివాసం వద్ద మట్టి, నీటిని లోకేష్ సేకరించారు. వీటిని పూజా కార్యక్రమాల అనంతరం అమరావతికి తరలిస్తారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అభిమానులు భారీగా హాజరయ్యారు.