: జగన్ ని పరామర్శించిన పార్టీ ముఖ్య నేతలు
వైఎస్సార్సీపీ అధినేత జగన్ ను ఆ పార్టీ నేతలు ఈరోజు కలిశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని పరామర్శించేందుకు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, తదితరులు ఆసుపత్రికి వెళ్లారు. జగన్ ను సంప్రదించి ప్రత్యేక హోదా పోరాట కార్యాచరణ ప్రకటించనున్నారు. అంతకుముందు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించడం కోసం చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణ కోసం ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు సమావేశమయ్యారు.