: జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన రఘువీరా
వైకాపా అధినేత జగన్ త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆకాంక్షించారు. గుంటూరులోని ఆసుపత్రిలో జగన్ కు చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని రఘువీరా మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం పోలవరంను కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టులో నీరు కాకుండా, డబ్బు ప్రవహించిందని విమర్శించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో టీడీపీ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు పోతోందని మండిపడ్డారు.