: సుధీంద్ర కులకర్ణి కసబ్ లాంటి వాడు: శివసేన
సుధీంద్ర కులకర్ణి కరుడుగట్టిన తీవ్రవాది కసబ్ లాంటి వాడని శివసేన పేర్కొంది. సుధీంద్ర కులకర్ణిలాంటి వాడు భారత్ లో ఉంటే పాకిస్థాన్ ప్రత్యేకంగా కసబ్ లాంటి వాడిని దాడుల కోసం భారత్ పైకి పంపించాల్సిన అవసరం లేదని అన్నారు. దేశంలో కులకర్ణి లాంటి వాడు ఒక్కడు ఉంటే 100 మంది కసబ్ లు చేసిన, చేయగల నాశనం చేస్తారని శివసేన అభిప్రాయపడింది. దేశ ప్రజలకంటే పాక్ మాజీ మంత్రి కసూరికి ఎక్కువ భద్రత కల్పించారని శివసేన పేర్కొంది. కాగా, పాకిస్థాన్ మాజీ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరి రాసిన 'నెయిదర్ ఏ హాక్ నార్ ఏ డవ్' పేరుతో రాసిన పుస్తకాన్ని నిన్న ముంబైలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతనికి మద్దతిచ్చిన బీజేపీ నేత సుధీంద్ర కులకర్ణికి శివసేన కార్యకర్తలు నల్ల ఇంకుపూసిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా నిరశన వ్యక్తమవుతోంది.