: అమరావతిపై నేటి నుంచి డ్రోన్ సర్వే
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సర్వేకు డ్రోన్ లను వినియోగించనున్నారు. ఇలా చిత్రీకరించడం ద్వారా అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని, రేపు జరిగే అభివృద్ధితో సరిపోల్చేందుకు ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. డ్రోన్ సర్వే ద్వారా అమరావతిలో ప్రతి అంగుళాన్ని చిత్రీకరించవచ్చని వారు వెల్లడించారు. డ్రోన్ ను రిమోట్ కంట్రోల్ తో నియంత్రిస్తూ భూమి స్థితిగతులు, ఎత్తుపల్లాలు, నీటి ప్రవాహం వంటి వాటిని ఒకే చోట నుంచి చిత్రీకరించవచ్చని అధికారులు వెల్లడించారు. ప్రతి 1.5 మీటరుకు అధికారులు నివేదిక తయారు చేస్తారని వారు వివరించారు. మూడు వారాలపాటు సాగనున్న ఈ డ్రోన్ సర్వే ద్వారా అమరావతి నగర నిర్మాణ తుది ప్రణాళికను తయారు చేస్తారని వారు తెలిపారు.