: అమరావతి ఆహ్వాన పత్రిక 'భాషా' వివాదం!


ఆంధ్రప్రదేశ్ ప్రజారాజధాని అమరావతి ఆహ్వాన పత్రికపై వివాదం రేగింది. తెలుగు రాష్ట్రంలో తెలుగు రాజధాని అని గొప్పగా చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతి ఆహ్వాన పత్రం ఆంగ్లంలో ముద్రించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగు భాషోద్యమ సమాఖ్య నేత సామల రమేష్ బాబు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, అమరావతి ఆహ్వాన పత్రికను తెలుగులో ముద్రించకపోతే ఆందోళన చేస్తామని అన్నారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు రాజధాని నిర్మాణానికి కూడా ఆంగ్ల ఆహ్వాన పత్రిక ఏంటని ఆయన ప్రశ్నించారు. తక్షణమే తెలుగులో ఆహ్వాన పత్రికను ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News