: బెజవాడ, శ్రీశైలం దేవాలయాల్లో నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు ఇందుకోసం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై గల కనకదుర్గమ్మ దేవాలయంలో అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు కనువిందు చేయనున్నారు. ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు దేవాలయాధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే వేములవాడ రాజన్న, శ్రీశైలం మహా క్షేత్రాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. పుణ్యక్షేత్రాలకు ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్ఠం చేశారు. విజయవాడలో 3,700 మంది పోలీసులతో భద్రత నిర్వహిస్తుండగా, ఇతర దేవాలయాల్లో మరింత భద్రత పెంచారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం విజయవాడ మీదుగా 300 రైళ్లను నడుపుతున్నారు.