: దీక్షను భగ్నం చేయొచ్చు... ఉద్యమాన్ని మాత్రం ఆపలేరు: బొత్స


వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షను ప్రభుత్వం బలవంతంగా భగ్నం చేసి ఉండవచ్చు, కానీ ఉద్యమాన్ని మాత్రం ఆపలేరని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, అధికారం ఉంది కదా అని ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజల కోసం చేపట్టిన దీక్షను భగ్నం చేయడం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రోజు ఉదయం 10:30 నిమిషాలకు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన చెప్పారు. దీనిని ఇంతటితో ఆపేసే ప్రసక్తే లేదని, ప్రజల్లోకి ఉద్యమరూపంలో తీసుకెళ్తామని ఆయన చెప్పారు. జగన్ కు మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News