: ఐరన్ లెగ్ శాస్త్రి కుటుంబానికి ‘సంపూ’ ఆర్థికసాయం


దివంగత హాస్య నటుడు ఐరన్ లెగ్ శాస్త్రి కుటుంబానికి 'హృదయ కాలేయం' ఫేమ్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఆర్థికసహాయం చేశారు. ఐరన్ లెగ్ శాస్త్రి కుమారుడు ప్రసాద్ కు రూ.25,000 చెక్కును ‘సంపూ’ అందజేశారు. ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ, ఐరన్ లెగ్ శాస్త్రి తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకులను ఏ విధంగా కడుపుబ్బ నవ్వించారో మన అందరికీ తెలుసన్నారు. "ఆయన హాస్యానికి విలువ కట్టలేము. ఆయన చనిపోయిన అనంతరం వారి కుటుంబం ఆర్థికంగా బాగా చితికిపోయిందన్న విషయం మీడియా ద్వారా తెలిసింది. అందుకే నా వంతు సాయం చేశాను" అన్నారు సంపూ. సినిమా ఇండస్ట్రీలోని వారు కూడా ఎంతో కొంత ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సంపూర్ణేష్ బాబు విజ్ఞప్తి చేశారు. ఐరన్ లెగ్ శాస్త్రి కుమారుడు ప్రసాద్ మాట్లాడుతూ, తమ కుటుంబం పరిస్థితి తెలుసుకుని ఆర్థికసాయం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా పరిశ్రమలోని పెద్దలు కూడా తమను ఆదుకోవాలని ప్రసాద్ కోరారు.

  • Loading...

More Telugu News