: రిగ్గింగును అడ్డుకున్న ఏజెంట్ నాలుక కట్ చేశారు!


ఎన్నికల్లో రిగ్గింగ్ ను అడ్డుకున్న ఒక ఏజెంట్ నాలుకను కత్తిరించిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఇటీవల అక్కడ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ జరిగింది. రాణీ గంజ్ ప్రాంతంలోని ప్రజాపతి పోలింగ్ బూత్ లో స్థానిక సంస్థ మాజీ అధ్యక్షుడు రమాకాంత్ తన కొడుకులతో కలిసి రిగ్గింగ్ చేసేందుకు యత్నించాడు. అక్కడ ఎన్నికల ఏజెంట్ గా ఉన్న ముస్తక్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దాంతో రమాకాంత్, తన కొడుకులు కలిసి ముస్తక్ నాలుకను కత్తిరించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఉమర్ ఫిర్యాదు మేరకు రమాకాంత్, ఆయన కొడుకులు, మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News