: బీహార్ లో ముగిసిన తొలి దశ ఎన్నికల పోలింగ్
బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది. 10 జిల్లాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అయితే కొన్ని చోట్ల నిర్ణీత సమయంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ఆయా కేంద్రాలలో పోలింగ్ కొనసాగుతోంది. కాగా, సాయంకాలం నాలుగు గంటల సమయానికి 52.12 శాతం పోలింగ్ నమోదైంది. పూర్తిస్థాయిలో ఎంత పోలింగ్ నమోదైందన్న వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.