: ఏపీ రాజధానికి భూములిచ్చిన రైతు కుటుంబాలకు ధోవతి, చీరలు


నవ్యాంధ్ర రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులను శంకుస్థాపన కార్యక్రమానికి ప్రభుత్వం ఆహ్వానించనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు 24వేల రైతు కుటుంబాలకు శంకుస్థాపన ఆహ్వాన పత్రం, దాంతో పాటు ఆప్కో సంస్థ వారి ధోవతి, కండువా, చీరెను కూడా పంపుతున్నారు. ఈ విషయాన్ని ఆప్కో ఛైర్మన్ ఎం.హనుమంతరావు తెలిపారు. ఈ నెల 14 నుంచి రైతులకు ఆహ్వానపత్రం, వస్త్రాలను పంపిస్తున్నట్టు చెప్పారు. శంకుస్థాపనకు వచ్చేరోజు వారంతా ఆ వస్త్రాలను ధరించనున్నారు.

  • Loading...

More Telugu News